గత రెండు సంవత్సరాల నుంచి కరోనా పరిస్థితుల కారణంగా మూతపడిన పాఠశాలలు ఇప్పుడిప్పుడే తెరుచుకున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలకు పంపించడం కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.అయితే ఇన్ని రోజులు పిల్లలు ఇంట్లో కూర్చోవడం వల్ల వారు మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం ఏర్పడుతున్నఈ క్రమంలో ఒకవైపు పిల్లలను స్కూలుకు పంపించాలంటే ఆరాటం ఉన్నప్పటికీ మరోవైపు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది ఇలాంటి సమయంలోనే తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని మెలగాలి లేదంటే ఎన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పాఠశాలకు వెళ్లే పిల్లలలో కొద్దిపాటి జ్వరం వచ్చిన, ముక్కు కారుతున్న, గొంతునొప్పి దగ్గు వంటి లక్షణాలు కనబడితే వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తం కావాల్సి ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనబడితే అది కరోనా కావచ్చు. అయితే సాధారణ జలుబు ఉన్న వారిలో కూడా ఈ విధమైనటువంటి లక్షణాలు కనపడతాయి. అయితే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమై పిల్లల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
పెద్దవారిలో మాదిరిగా కరోనా సోకిన పిల్లలలో రుచి, వాసన కోల్పోయే లక్షణాలు కనిపించవు కనుక తల్లిదండ్రులు తరచూ పిల్లలను గమనిస్తూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కరోనా సోకినప్పటికి కొంతమంది పిల్లలలో లక్షణాలు బయట పడటం ఆలస్యం కావచ్చు కనుక వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఎంతో అవసరం.
పిల్లల్లోతరచూ జ్వరం, నీళ్ల విరోచనాలు, చర్మంపై మచ్చలు, దద్దుర్లు ఏర్పడడం,కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. కరోనా మాత్రమే కాకుండా పిల్లలలో మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్. ఈ వ్యాధి పిల్లలలో కనిపిస్తోందని వైద్యులు వెల్లడించారు. అయితే కుటుంబంలో ఎవరైనా కరోనా బారిన పడి ఉంటే వారి ద్వారా MIC పిల్లలకు వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరించారు. కనుక కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకిన పిల్లలకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


































