Crime News: ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు వల్ల అనేక ఘోరాలు జరుగుతున్నాయి. ఈ వివాహేతర సంబంధాల వల్ల కుటుంబ కలహాలతో ఎంతోమంది భార్యాభర్తలు విడిపోగానే.. వీటి వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజంలో గౌరవమైన పదవులలో ఉన్న వ్యక్తులు కూడా అక్రమ సంబంధాల వల్ల వారి పరువు తీసుకుంటున్నారు.

అచ్చం ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఘోరం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బిజ్నోర్ జిల్లాకు చెందిన రుచిసింగ్ అనే మహిళా కానిస్టేబుల్… ప్రతాప్ ఘఢ్ జిల్లా రాణిగంజ్ తహసిల్దార్ తో వివాహేతర సంబంధంలో ఉంది.

ప్రస్తుతం రుచిసింగ్ లక్నోలో పని చేస్తోంది. ఈమె అర్జన్ గంజ్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. వృత్తి రీత్యా ప్రభుత్వ ఉద్యోగులైన వీరిద్దరూ గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా కేరళ 13వ తేదీ నుండి ఆమె విధులకు హాజరు కాకపోవటంతో తోటి ఉద్యోగులలో అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీ ఆమె శవం ఒక కాలువ లో లభించింది.
వివాహం చేసుకొమ్మని అడగడమే శాపమైంది…
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా రుచి సింగ్ వివాహేతర సంబంధం బయటపడింది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టి తహసీల్దార్ ని విచారణ చేయగా.. తానే హత్య చేశాడని ఒప్పుకున్నాడు. గత కొంత కాలంగా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉండటం వల్ల రుచి సింగ్ ఈ మద్య తనని వివాహం చేసుకోమని వేధిస్తుండటంతో ఆమెను హత్య చేసినట్టు తహసీల్దార్ నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు తహసీల్దార్ ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.































