Faria Abdullah:జాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు పొడుగు కాళ్ళ సుందరి ఫరియా అబ్దుల్లా. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు తర్వాత సినిమాలలో నటించే అవకాశాలు రాలేదు. అయితే నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో ఒక స్పెషల్ సాంగులో సందడి చేశారు.

ఇలా ఈమె ఇతర సినిమాలలో నటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ డాన్స్ వీడియోలు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఇలా సోషల్ మీడియా వేదికగా నిత్యం అభిమానులకు టచ్ లో ఉన్నటువంటి ఫరియా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా పెళ్లి ప్రస్తావన రావడంతో ఈమె పెళ్లి గురించి మాట్లాడుతూ పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఒకరితోనే ఉండాలి అలా ఉండడం నాకు ఏమాత్రం నచ్చదు అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు.ఇలా జీవితాంతం ఒకరితోనే ఉండడం తనకు నచ్చదు అంటూ ఫరీయా చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారడంతో పలువురు ఈ కామెంట్లపై విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Faria Abdullah: ఇలాంటి వారే విడాకులు తీసుకొనేది…
లైఫ్ లాంగ్ ఒకరితో ఉంటేనే వారి మధ్య బంధం బలపడుతుంది అనేది ఈ పెళ్లి కాన్సెప్ట్ అలాంటిది ఈమెకు జీవితాంతం ఒకరితో ఉండడం కష్టమని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ కామెంట్లపై స్పందించిన కొందరు ఇలాంటి ఆలోచనలు చేసేవారు పెళ్లిళ్లు కనుక చేసుకుంటే వెంటనే విడాకులు తీసుకుంటున్నారని పలువురు ఈమె వ్యాఖ్యలపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.