తెలంగాణలో టీఆర్ఎస్ ఎన్నికల వేళ రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న వారందరికీ రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆ రుణాలను దశల వారీగా మాఫీ చేస్తూ వస్తోంది. మొదట రూ. 25 వేలలోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణాలను మాఫీ చేసింది. అయితే ఇటీవల రూ.50 వేల వరకు రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీనిని కూడా ఆగస్టు 16వ తేదీ నుండి రైతుల ఖాతాలో రుణమాఫీ నగదు మొత్తం జమకానుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నగరంలోని బీఆర్‌కేఆర్ భవన్‌లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. 42 బ్యాంకుల అధికారులు భేటీకి హాజరయ్యారు.
సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రూ. 50 వేలలోపు రైతు రుణ మాఫీపై క్యాబినెట్ సమావేశంలో సీఎం ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగష్టు 15 వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా రూ. 50 వేలలోపు రైతు రుణాల మాఫీ ప్రకటిస్తారు. ఆగష్టు 16 వ తేదీ నుంచే ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,006 కోట్లు జమ అవుతాయి.
బ్యాంకర్లు , ప్రభుత్వ అధికారులు సమన్వయంతో రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అయ్యేలా చూడాలి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






























