ప్రస్తుతం వర్షాలకాలం నుంచి చలికాలానికి వెళ్తున్నాం. అయితే వాతావరణం ఈ రెండు కాలాల్లో చల్లగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వేడివేడిగా ఎవరికైనా తినాలని అనిపిస్తుంటుంది. అయితే ఇందులో వేడిగా పల్లీలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు అంతే కాకుండా.. ఈ పల్లీల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. పల్లీల్లో బోలెడన్ని పోషకాలు దాగివున్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు.

పల్లీల్లో మోనోశాచురేటెడ్ కొవ్వుల కారణంగా వీటిని మోతాదుకు మించకుండా తినడం వల్ల గుండెజబ్బులను ఇరవై శాతం వరకూ తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం 100 గ్రాముల పల్లీలలో 567 క్యాలోరీలు ఉంటాయి. వీటిని రోజుకు ఒక కప్పు తీసుకుంటే.. ఎలాంటి జబ్బులు మన జోలికి కూడా రావని నిపుణులు చెబుతున్నారు.
అయితే ముఖ్యంగా పల్లీలు మతిమరుపు సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగపడుతాయట. శరీరంలో అన్ని జీవక్రియలను నియంత్రించడానికి అవసరం అయ్యే విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉన్నాయి. వేరుశెనగలో విటమిన్ బి పుష్కలంగా ఉండి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి మరియు జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
పల్లీలలో ఉండే అమినో యాసిడ్స్ శరీరంలో నిల్వ ఉన్న చెడు కొవ్వులను కరిగించి మంచి కొవ్వు నిల్వ ఉండేలా చేస్తుంది. పల్లీల లో కాల్షియం కూడా అధికంగా లభించడంతో ఎముకలు బాగా దృఢపడతాయి. అంతేకాకుండా వీటిని పెరిగే పిల్లలకూ, గర్భిణులకూ, పాలిచ్చే తల్లులకూ ఎంతో మంచివి. వేయించిన తాజా గింజల్ని బెల్లంతో కలిపి ఉండలు చేసుకుని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. అలాగే పల్లీలు నానబెట్టి ప్రతిరోజు కొంచెం తీసుకోవడం వలన గ్యాస్ సమస్యను కూడా ఎదుర్కోవచ్చంటూ నిపుణులు చెబుతున్నారు.






























