మనిషి శరీరంలో 80 శాతం నీరు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మన శరీరంలోని అవయవాలు, కణాలు సరిగా పని చేయాలి అంటే సరైన మోతాదులో నీటిని తీసుకోవడం ఎంతో అవసరం. అందుకే చాలామంది నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కొంత మంది రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగుతూ ఉంటారు. అయితే నీటిని తక్కువ తీసుకున్నా అనేక సమస్యలు ఎదురవుతాయి. అదేవిధంగా నీటిని ఎక్కువగా తీసుకున్నా కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే మనలో చాలామంది దాహం లేకుండా కూడా నీళ్లు తాగుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం…

మధుమేహం : ప్రస్తుత జనరేషన్ లో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిలో వేగంగా విస్తరిస్తున్న వ్యాధి మధుమేహం. దీనికి గల ముఖ్య కారణం రక్తంలో చక్కెర శాతం పెరగడం. అందువల్ల ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. అదేవిధంగా శరీరంలో సరిపడా నీరు లేకపోతే కూడా మూత్రపిండాలు సరిగా పని చేయవు.
అజీర్ణం : మనం ఎక్కువగా కారం ఉన్న పదార్థాలను తినడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. దీంతో ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరానికి ఎక్కువ నీరు కావాలి. ఈ క్రమంలోనే నీటి కొరత ఏర్పడి అధిక దాహానికి కారణమవుతుంది.
విపరీతంగా చెమటలు : శరీరం నుంచి ఎక్కువగా చెమట విడుదల ఉన్నప్పుడు శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితులోనే శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి శరీరం ఎక్కువ నీటిని కోరుతుంది.
ఆందోళన : ఈ ఆందోళన కారణంగా నోరు ఎండిపోవడమే కాకుండా వ్యక్తి ఎక్కువగా నీరు కూడా తాగుతూ ఉంటారు. అటువంటి పరిస్థితులలో కొన్ని ఎంజైములు నోటిలో ఉత్పత్తి అయ్యే లాలాజలం మొత్తాన్ని కూడా తగ్గిస్తాయి. అధికంగా దాహం వేస్తుంది .































