Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలోనే గేమ్ ఛేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు.

ఇటీవల ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం లక్నోలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప2 సినిమా ట్రైలర్ పాట్నాలో జరగడంతో ఊహించని విధంగా ఈ కార్యక్రమానికి అభిమానులు తరలి వచ్చారు. ఇది చూసిన గేమ్ ఛేంజర్ మేకర్స్ ఏకంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అమెరికాలో నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ అని ట్యాగ్ ఉంది అయితే ఈ ట్యాగ్ ఉపయోగించుకొని అమెరికాలో ఈ సినిమా వేడుకను నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. ఇలా ఇతర దేశాలలో ఈ సినిమా వేడుకను నిర్వహిస్తే పెద్దగా బజ్ రాకపోవచ్చు అని అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ఇప్పటివరకు ప్రేక్షకులలో ఏమాత్రం హైప్ లేదని చెప్పాలి.

Game Changer: అమెరికాలో..
సంక్రాంతికి ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో కలెక్షన్ల వరకు పరవాలేదు కానీ రికార్డులు సాధించాలి అంటే సినిమాపై మంచి హైప్ ఉండాలి. ఇలాంటి తరుణంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ప్రమోషన్లను నిర్వహించకుండా విదేశాలలో ఈ సినిమా వేడుకలను నిర్వహిస్తే ఖచ్చితంగా సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.యూఎస్‌ఏలో ఓ తెలుగు మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి. డిసెంబర్ 21న గార్లాండ్‌లోని కుర్తీస్ కుల్‌వెల్ సెంటర్‌లో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ నిర్ణయం ఎంతవరకూ కరెక్ట్ అనేది చాలా మంది సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.































