తెలంగాణ వాసులకు శుభవార్త.. ఆ వాహనాలపై భారీ డిస్కౌంట్లు..?

0
329

తెలంగాణ సర్కార్ కొత్తగా వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వాహనదారులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సంబంధించి నూతన విధానాన్ని ప్రకటించింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ నుంచి రాబోయే పదేళ్లకు రాబోయే పది సంవత్సరాలకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ తెలంగాణను ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్‌ హబ్‌ గా మార్చే విధంగా కొత్త విధానాలను రూపొందించామని తెలిపింది.

తెలంగాణ సర్కార్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగానికి పలు ప్రోత్సాహకాలను అందించడానికి సిద్ధమవుతోంది. నూతన విధానం ప్రకారం వాహనాలను రాష్ట్రంలోనే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ప్రభుత్వం నుంచి రాయితీలను పొందవచ్చు. తెలంగాణ సర్కార్ ఉత్తర్వుల ప్రకారం ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్‌ నాలుగు చక్రాల వాహనాలు, ఎలక్ట్రిక్‌ ఆటోలు, ఎలక్ట్రిక్‌ బైక్‌లపై రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్‌ రుసుం మినహాయింపు ఇవ్వనుంది.

కొత్త ఉత్తర్వుల ప్రకారం ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ తో పాటు రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పూర్తిగా తొలగిస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలనుకునే వినియోగదారులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం ప్రత్యేక మైన చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారు. తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను ప్రజలు ప్రశంసిస్తున్నారు.

రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడం వల్ల వాహనదారులకు సైతం ప్రయోజనం కలగనుంది. వాహనాలపై భారీగా డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల వాహనాల కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.