Hanshitha Reddy: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి గురించి మనకు తెలిసిందే. ఈమె శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్, దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థకు ఫౌండర్, మేనేజింగ్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక హన్షిత రెడ్డి దిల్ రాజు మొదటి భార్య అనిత కుమార్తె.

హన్షిత వివాహం అర్చిత్ రెడ్డితో జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ దంపతులకు ఒక పాప ఒక బాబు ఉన్నారు.ఇలా వ్యక్తిగత జీవితంలోను వృత్తిపరమైన జీవితంలో ఎంతో సంతోషంగా బిజీగా గడుపుతున్న హన్షిత తన 32వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఈమె తన పుట్టినరోజు వేడుకలలో భాగంగా కేక్ కట్ చేస్తూ ఉన్నటువంటి వీడియోలను కూడా షేర్ చేశారు.
బ్యూటిఫుల్ డెకరేషన్, యమ్మీ బర్త్‌డే కేక్ కట్ చేస్తూ, షాంపెయిన్ పొంగిస్తూ సంబరాలు చేసుకున్నారు.తన తండ్రి భర్త పిల్లలు తన స్నేహితుల నడుమ ఈమె తన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నట్టు తెలుస్తుంది.

Hanshitha Reddy: స్టైలిష్ సిల్వర్ డ్రెస్‌లో మెరిసిపోయిన హన్షిత..
హన్షిత తన పుట్టినరోజు వేడుకలలో భాగంగా స్టైలిష్ సిల్వర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఇలా తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ దిల్ రాజు కుమార్తె హన్షితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
































