తెలుగు యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు కొనసాగుతూనే ఉంది. తాజాగా స్వేచ్ఛ కుమార్తె మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేసింది. తన తల్లి మృతికి పూర్తిగా పూర్ణచందర్‌నే బాధ్యతవహించాల్సి ఉంది అని స్పష్టం చేసింది. అంతేకాదు, అతడిపై తీవ్రమైన కోపంతో “అతన్ని చంపేయాలని ఉంది” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

“చంపేముందు, మా అమ్మ చెప్పుతో, నా చెప్పుతో అతన్ని కొట్టాలని ఉంది” అంటూ ఆమె చెప్పిన మాటలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. తాను ఎంతో మానసిక వేధనకు గురైయ్యానని, పూర్ణచందర్ తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించింది. తల్లితో పాటు తాను కూడా చాలా బాధలు అనుభవించానని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ సంఘటనతో సంబంధించి పూర్ణచందర్ ప్రవర్తన, స్వేచ్ఛ బలవన్మరణం వరకు ఆమెను వెంటాడిన మానసిక పరిస్థితి, ఆ కుటుంబం లోని బాధ్యతలన్నీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. న్యాయపరమైన దర్యాప్తుతోపాటు, ఇటు పబ్లిక్ కోర్టులోనూ పూర్ణచందర్‌పై నిందలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి.
స్వేచ్ఛ కుమార్తె మాటల్లో వ్యక్తమైన ఆవేదన, తల్లి కోల్పోయిన వేదన ఇప్పుడు సోషల్ మీడియాలో హృదయాల్ని కదిలిస్తోంది. ఈ కేసు ఎంత త్వరగా, నిజానిజాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సిందే.
తన తల్లి సూసైడ్‌కు కారణమైన పూర్ణచందర్‌ను చంపేయాలి
— ChotaNews App (@ChotaNewsApp) June 29, 2025
:యాంకర్ స్వేచ్ఛ కూతురు
చంపేముందు తన చెప్పుతో, తన తల్లి చెప్పుతో పూర్ణచందర్‌ను కొట్టాలని ఉందని తెలిపారు.
తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఎంతో మానసిక వేధన అనుభవించానని పేర్కొన్నారు. https://t.co/Qf5ImOOzse pic.twitter.com/KP2MA1KRtk































