ఎప్పుడూ సినిమాలతో బిజీ బిజీగా ఉండే సిద్దార్థ్ ఈ మధ్య రాజకీయాలలో తలదూరుస్తున్నాడు. ముఖ్యంగా బిజేపీ పార్టీ అంటే మండిపడుతున్నాడు. బిజేపీ పార్టీపై నిత్యం ఏవో ఒక విమర్శలు చేస్తూనే ఉన్నాడు సిద్దార్థ్. దీనితో బిజేపీ నేతలు కూడా సిద్దార్థ్ పై రివర్స్ అటాక్ చేస్తున్నారు. అయినా సరే సిద్దూ ఈమాత్రం తగ్గడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా బీజీపీ పార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు.

తాజగా ఏపీ బిజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు హీరో సిద్దార్ద్.. హీరో సిద్ధార్ద్ సినిమాలకు దావూద్ ఇబ్రహీం నిధులు సమకూరుస్తున్నదంటూ విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిద్దార్డ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.

విష్ణు వర్ధన్ రెడ్డి పెట్టిన ట్వీట్ పై సిద్దర్ద్ స్పందిస్తూ “లేదు రా అతడు నా TDS కట్టేందుకు సిద్ధంగా లేడు. నేను పెర్ఫెక్ట్ సిటిజన్, టక్స్ పేయర్ కదరా విష్ణు.. వెళ్లి పడుకో.. బిజేపీ స్టేట్ సెక్రటరీ అంట.. సిగ్గుండాలి ” అంటూ తీవ్ర పదజాలంతో ట్వీట్ చేసారు సిద్దార్ద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here