సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఒకప్పుడు పెద్ద రచ్చే జరిగింది. బాలీవుడ్ నటి తను శ్రీ దత్తా దగ్గర మొదలైన ఈ “మీటూ” ఉద్యమం మన దేశం మొత్తం పాపులర్ అయింది. ఎందరో నటీమణులు తమకు ఎదురైనా చెడు అనుభవాలను సోషల్ మీడియా సాక్షిగా బయటపెట్టారు. సింగర్ చిన్మయి కూడా తమకు ఇటువంటి అనుభవాలు ఎదురవుతున్నయంటూ బయటపెట్టారు. హీరొయిన్ రాధికా ఆప్టే కూడా కొందరి వల్ల ఇబ్బందులు పద్దనంటూ వాపాయింది. ఇక శ్రీరేడ్డి ఈ అంశంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆతరువాత వీరు చేసిన ఆరోపణల తరువాత వీరికి అవకాశాలు తగ్గాయనే ఆరోపణలు ఉన్నాయి.

అయితే తాజాగా ఈ అంశంపై స్పందించింది స్టార్ హీరోయిన్ సమంత. ఇదివరకు తన స్నేహితురాలు అయిన చిన్మయికి మద్దతు పలికింది కాని, ఎప్పుడు స్పందించలేదు. ఇప్పుడు తాజగా క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడింది అక్కినేని వారి కోడలు. “క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రిలోనే కాదు, దాదాపు అన్ని ఇండస్ట్రిలలోను ఉంది. ఇక పొతే ఇండస్ట్రిలో మంచి వారు ఉన్నారు… చెడ్డవారు ఉన్నారు. అయితే నాకు మాత్రం మంచి వారే ఎదురయ్యారు. చెడ్డవారు ఎవరు ఎదురుకాకపోవడం నా అదృష్టం. అందువల్ల నేను మాత్రం ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడలేదు.” అంటూ సమాధానం ఇచ్చింది అక్కినేని వారి కోడలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here