పోస్టాఫీస్ కు వెళ్లకుండా సుకన్య సమృద్ధిలో డిపాజిట్ చేసే ఛాన్స్.. ఎలా అంటే..?

0
97

కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం అమలు చేస్తున్న స్కీమ్ లలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. సుకన్య సమృద్ధి యోజన
స్కీమ్ ద్వారా తల్లిదండ్రులు ఆడపిల్లల పేరుపై ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది. దేశంలోని ప్రముఖ బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ లు సైతం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఖాతాను ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఆడపిల్లల భవిష్యత్ కు భద్రత కల్పించడానికి కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

ఇతర స్కీమ్ లతో పోల్చి చూస్తే ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ఎక్కువ మొత్తం వడ్డీని పొందే అవకాశం కూడా ఉంటుంది. ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల పేర్లపై సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ పై ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ లభిస్తుండగా కేవలం 250 రూపాయలతో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు.

ఆడపిల్ల బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, ఇతర డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా సులభంగా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసిన రోజు నుంచి 15 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలుగా ఉంది. ఈ స్కీమ్ లో చేరితే మెచ్యూరిటీ కాలంలో 26 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది.

ఆడపిల్లల ఉన్నత చదువులు, పెళ్లి కోసం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ద్వారా డిపాజిట్ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. పోస్టాఫీస్ కు వెళ్లకుండా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఈ స్కీమ్ అకౌంట్ లోకి డబ్బులు జమ చేయవచ్చు. బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు సులభంగా ఆటోమేటిక్ డెబిట్ ద్వారా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో డబ్బులు జమ చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here