నిజానికి మనం చేసే ప్రతి పనికి ఒక పద్ధతి ఉంటుంది. ఎంత చిన్న పని అయినా పద్ధతి పద్ధతి ప్రకారం చేస్తేనే దాని నుంచి మనం సంపూర్ణ ప్రతిఫలం పొందవచ్చు. అలాగే మన నిత్య జీవితంలో ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం అయినా, త్రాగే నీరు అయినా ఒక పద్ధతి ప్రకారం తీసుకోవాలి అప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతాం.ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఆహారం తీసుకునే విషయంలో కొన్ని చిన్నచిన్న నియమాలు పాటిస్తే అనారోగ్యం సమస్యలకు దూరంగా ఉండవచ్చుననీ, ముఖ్యంగా జీర్ణ సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

భారతీయ ఆయుర్వేదం ప్రకారం ప్రతిరోజు భోజనానికి అరగంట ముందు, అరగంట తరువాత మాత్రమే మంచినీరు తాగాలి. భోజనం చేసిన వెంటనే ఎక్కువ నీరు తాగడం వల్ల జీర్ణరసాలు పలుచబారతాయి. దీనివల్ల తిన్న ఆహార పదార్థాలు జీర్ణం అవడంలో సమస్యలు ఏర్పడతాయి.అదేవిధంగా అధిక ప్రోటీనులు కలిగిన పాలు, పండ్లు మరియు పాలు, చేపలు, పెరుగు. అలాగే అధిక కొవ్వు పదార్థాలతో కలిసి ఏవిధమైన ఆహారాన్ని తీసుకోకూడదు వీటిని కలిపి తినడం వల్ల సరిగా జీర్ణం కాక గ్యాస్టిక్ వంటి సమస్యలు ఏర్పడతాయి.
ఆయుర్వేద వైద్యుల సూచన ప్రకారం ఆహారం ఆకలి వేసినప్పుడు మాత్రమే తీసుకోవాలి. సమయానికి తినాలి, ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత తింటే జీవక్రియ రేటు తగ్గి ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆహారం తినేటప్పుడు టీవీ చూడడం, ఫోన్లో మాట్లాడడం, పుస్తకాలు చదవడం మంచి పద్ధతి కాదు ఇలా చేయడం వల్ల ఎంత తింటున్నారో తెలియక ఎక్కువ తిని అధిక బరువు సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆహారం తినేటప్పుడు సాధ్యమైనంతవరకు నిశ్శబ్దంగా, ప్రశాంతమైన వాతావరణంలో కంఫర్ట్ గా కూర్చుని తినడం మంచిది.































