Ileana: దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు గోవా ముద్దుగుమ్మ ఇలియానా.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం పోకిరి సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ హీట్ అందుకున్నారు. ఇలా వరుస సినిమాలో హిట్ అవడంతో ఈమెకు తెలుగు తమిళ భాషలలో వరుసగా అవకాశాలు వచ్చాయి ఇలా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగినటువంటి ఇలియానా అనంతరం ఇండస్ట్రీకి దూరమయ్యారు.

వరుస హిట్ సినిమాలలో నటిస్తూ వచ్చిన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకోవటం వల్ల ఈమె సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఇలియానా అవకాశాలను కోల్పోవడంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అందాలను ఆరబోస్తూ అవకాశాలకు ఎరవేస్తున్నారు.అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఇలియానా తాజాగా ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.
పెళ్లి కాకుండా ఇలియానా తల్లి కాబోతుందంటూ ఆమె ఒక పోస్ట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.అసలు పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అవ్వడం, మరీ ఈ విషయాన్ని తెలియచేయడంతో అందరూ షాక్ అయ్యారు. రెండు రోజుల క్రితం ఇలియానా తన బేబీ బంప్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈమె మరోసారి తన ప్రెగ్నెన్సీ గురించి తెలియజేశారు.

Ileana: నిద్ర కూడా పట్టడం లేదు..
ఇలా ప్రెగ్నెంట్ అయినటువంటి ఇలియానా ప్రతిక్షణం తన ప్రేగ్నెన్సీని ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. కడుపులో బిడ్డ తంతున్నాడని తనకు నిద్ర కూడా పట్టడం లేదని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు. ఇలా గర్భవతిగా తన ప్రేగ్నెన్సీ సమయాన్ని ఆస్వాదిస్తూ ఆ అనుభవాలను ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు అయితే అభిమానులు మాత్రం పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేయడంతో బిడ్డకు తండ్రి ఎవరు అంటూ తనని ట్రోల్ చేస్తూనే ఉన్నారు.