గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్ పోస్టల్ శాఖ 2582 పోస్టల్ సర్వెంట్ల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పదో తరగతి పాసైన వాళ్లను మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూలు ఉండవు.

ప్రస్తుతం ఈశాన్య, పంజాబ్ పోస్టల్, జార్ఖండ్ సర్కిల్ లోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. జీడీఎస్ ఉద్యోగాలు కాకుండా ఇతర ఉద్యోగాలపై ఆసక్తి ఉంటే appost.in వెబ్ సైట్ ద్వరా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 2582 పోస్టులలో జార్ఖండ్ పోస్టల్ సర్కిల్ లో 1,118 పోస్టులు, నార్త్ ఈస్టర్న్ పోస్టల్ సర్కిల్ లో 948 పోస్టులు , పంజాబ్ పోస్టల్ సర్కిల్ లో 516 పోస్టులు ఉన్నాయి.

గ్రామీణ్ డాక్ సేవక్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాస్ కావాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.

అధికారిక పోర్టల్ కు వెళ్లి ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ నెల 11వ తేదీలోగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్ట‌ర్‌, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్ట‌ర్ ఉద్యోగాల భర్తీ కూడా జరుగుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here