Jabardasth Varsha: బిగ్ బాస్ లోకి అడుగు పెట్టనున్న జబర్దస్త్ వర్ష… అలా క్లారిటీ ఇచ్చేసిందిగా?

0
74

Jabardasth Varsha: జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వర్ష ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అందరిని సందడి చేస్తున్నటువంటి ఈమె సినిమా అవకాశాలను కూడా అందుకొని బిజీగా ఉన్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వర్ష బిగ్ బాస్ లోకి రాబోతుందని సమాచారం.

త్వరలోనే తెలుగు బిగ్ బాస్ 7ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే జబర్దస్త్ వర్ష కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వార్తలపై వర్ష క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వర్ష తన గురించి పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలోనే తాను ఓ పెద్ద కార్యక్రమంలో పాల్గొనబోతున్నానని తెలిపారు. అలాగే తన చదువు తన ఇతర వ్యక్తిగత విషయాలన్నింటి కూడా తాను అక్కడే అందరికీ చెబుతానని తెలియజేశారు.

Jabardasth Varsha: చెక్కు కూడా పంపించారు…


ఇప్పటికే ఆ కార్యక్రమానికి సంబంధించిన వారు తనకు అడ్వాన్స్ చెక్కు కూడా పంపించారని వర్ష తెలిపారు.ఈ విధంగా ఈమె ఓ కార్యక్రమానికి వెళ్లబోతున్నాను అంటూ చెప్పడంతో తప్పకుండా అది బిగ్ బాస్ కార్యక్రమమే అయ్యి ఉంటుందని తెలుస్తోంది. ఇలా జబర్దస్త్ వర్ష బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన బోతున్నారని క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.