Jr NTR: ఎన్టీఆర్ చిన్నప్పుడు ఇలాంటి అల్లరి పనులు చేసేవారా… తన అల్లరి పనులను బయటపెట్టిన తారక్!

0
28

Jr NTR: నందమూరి వారసుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా గ్లోబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బాలనటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ అనంతరం హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన షూటింగ్ లొకేషన్లో ఎంతో సరదాగా ఉంటారని చాలా అల్లరి చేస్తూ అందరిని ఆట పట్టిస్తూ ఉంటారని ఎంతోమంది ఈయనతో కలిసి పనిచేసిన సెలబ్రిటీలు ఎన్టీఆర్ అల్లరి గురించి చెబుతూ వచ్చారు.అయితే ఎన్టీఆర్ చిన్నప్పటినుంచి కూడా ఇంతే అల్లరి పనులు చేసే వారని ఇలా అల్లరి పనులు చేస్తూ తన తల్లి చేతిలో బాగా దెబ్బలు కూడా తిన్నానని ఓ సందర్భంలో తన అల్లరి పనుల గురించి బయట పెట్టారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…తాను చిన్నప్పుడు చాలా అల్లరి పనులు చేసేవాడని తన అమ్మ తనని బెల్ట్ తీసుకొని బాగా కొట్టేదని ఎన్టీఆర్ తెలియజేశారు. అయితే తనని బెల్టుతో కొట్టడం వల్ల ఆ బెల్ట్ తీసుకెళ్లి అమ్మకు తెలియకుండా మా కాలనీలో ఉన్నటువంటి ఒక ట్రాన్స్ ఫార్మర్ లో పెట్టానని తెలిపారు. అయితే బెల్ట్ పెట్టడం వల్ల ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందని ఎన్టీఆర్ వెల్లడించారు.

Jr NTR: అమ్మ బెల్ట్ తోనే కొట్టేది…


ఇలా ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో మూడు రోజుల పాటు మా వీధిలో కరెంటు లేదని అయితే తాను చేసిన పని వల్ల ఇంత విస్ఫోటనం జరగడంతో తాను భయపడిపోయానని ఎన్టీఆర్ తెలియజేశారు.అయితే లక్కీగా ఈ విషయం మా అమ్మకు తెలియకపోవడంతో తాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని ఈ సందర్భంగా ఎన్టీఆర్ తాను చేసిన అల్లరి పనుల గురించి చెబుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.