Karisma Kapoor: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడు ఎంతో సంతోషంగా చాలా లగ్జరీ లైఫ్ గడుపుతూ ఉంటారని చాలామంది భావిస్తారు. అయితే వారు కూడా వారి జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటారనే విషయాలు వాళ్ళు చెబితే తప్ప మనకు తెలియదు. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్స్ పెళ్లయిన తర్వాత జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్న వారిలో కరిష్మా కపూర్ ఒకరు.

బాలీవుడ్ హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతూ హీరోయిన్ గా పీక్ స్టేజ్ కి వెళ్ళిన సమయంలో ఈమె 2003 వ సంవత్సరంలో సంజయ్ కపూర్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు.అందరిలాగే తన వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుందని కరిష్మా భావించినప్పటికీ తాను అనుకున్న విధంగా తన జీవితం లేదని తాజాగా ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.
పెళ్లి తర్వాత సంజయ్ తనని ఎన్నో చిత్రహింసలు పెట్టారని, వాటిని భరించలేకే తాను విడాకులు తీసుకున్నానని తెలియజేశారు. తనకు తన అత్తగారు సంజయ్ తల్లి ఒక డ్రెస్ కొనిచ్చారు. ఆ డ్రెస్ తనని వేసుకోమని చెప్పారు. అయితే అప్పటికే తాను పెద్ద కుమారుడు కియాన్ కి జన్మనివ్వడంతో కాస్త లావు అవ్వడం వల్ల ఆ డ్రెస్ వేసుకోలేకపోయాను.

Karisma Kapoor: డ్రెస్ కోసం నన్ను కొట్టబోయారు…
తన తెచ్చిన డ్రెస్ వేసుకోలేదని తన భర్తకు ఫిర్యాదు చేయగా సంజయ్ లాగిపెట్టి కొట్టు అంటూ తన తల్లికి సలహా ఇచ్చారు.ఆ సమయంలో తన కుమారుడి కోపాన్ని ఆపాల్సింది పోయి ఆమె కూడా తనకు మరింత ఆజ్యం పోయడం తనకు చాలా బాధ కలిగించిందని ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్నటువంటి కష్టాల గురించి కరిష్మా కపూర్ బయటపెట్టారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

































