అలనాటి అందాల తార, దివంగత నటి హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దాదాపుగా అన్ని భాషల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుంది.చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని మొదలు ఆరంభించి దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగింది. ఈమె తన అందం అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది.

శ్రీదేవి సినీ ఇండస్ట్రీలో తనదంటూ చేరగని ఒక ముద్రను వేసుకుంది. ఇది ఇలా ఉంటే అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబం నుంచి మరో వారసురాలు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది. శ్రీదేవి మేనకోడలు శిరీష. ఓ ప్రైవేటు మ్యూజిక్ వీడియో సాంగ్‌లో ఆమె కనువిందు చేస్తోంది.
కేరళ నేపథ్యంలో అక్కడి సాంప్రదాయంలో ఓ లవ్‌ట్రాక్‌పై ఈ మ్యూజిక్ వీడియో సాగింది. ప్రస్తుతం ఈ మ్యూజిక్ వీడియో నెటిజన్ లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో లవ్ ట్రాక్ ను రెండు, మూడు, జనరేషన్ లో చూపించారు.
అయితే ఈ వీడియోలో ఆమెతో పాటుగా మరొక సీనియర్ నటుడు మనవడు కూడా నటించాడు. శివాజీ గణేశన్ మనవడు దర్శన్, శిరీషకు జోడిగా నటించాడు. కొన్ని జనరేషన్‌లుగా లవ్ చేసుకుంటున్న జంటల ప్రేమ ఇతివృతంలో ఈ పాట సాగింది.ఈ పాటలో శిరీష, దర్శన్‌లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
ఈ మ్యూజిక్ వీడియోను సీనియర్ నటి పద్మిని మనవరాలు లక్ష్మి దేవి రూపొందించింది.యదలో మౌనం అంటూ సాగే ఈ మ్యూజిక్ వీడియోకు అచ్చు రాజమణి, వరుణ్ మీనన్ సంగీతం సమకూర్చగా.. టాలీవుడ్ యువ గీత రచయిత పూర్ణాచారి సాహిత్యం అందించాడు. కాగా ఇప్పటికే శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ప్రస్తుతం జాన్వి బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. ఇక రెండో కూమార్తె ఖుషి కపూర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది.
































