Ap Politics: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చాలా వేడి మీద కొనసాగుతూ ఉన్నాయి. ఆంధ్ర రాజకీయాలు ఎప్పుడు కూడా ఆసక్తికరంగా ఉంటాయని సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల హడావిడి కావడంతో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతూ ఉన్నాయి.

ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు వైసిపి నుంచి టీడీపీకి టిడిపి నుంచి వైసీపీకి వలసలు వెళ్తున్నారు. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇరువురి పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే ఈ గొడవలను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.
లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సొంత బాయ్ బాయ్ మీదే గొడ్డలి వేటు వేసి దక్కించుకున్నటువంటి అధికారం ఈసారి పోతుందన్న భయంతోనే వైకాపా నేతలు గొడ్డలి ఎత్తుతూ దాడులకు పాల్పడుతున్నారని ఈయన కామెంట్లు చేశారు. జగన్ ఆయన సైకో సైన్యానికి ఇవే ఆఖరి రోజులని లోకేష్ తెలిపారు.
ఇవే ఆఖరి రోజులు..
ఇటీవల గిద్దలూరు మండలం గడికోటకు చెందిన మునయ్య వైకాపా నుంచి టిడిపిలోకి రావడంతో వైకాపా నేతలు తనని బెదిరించి గొడ్డలితో దారుణంగా నరికి చంపడంతో లోకేష్ ఈ విధమైనటువంటి ట్వీట్ చేశారు. తప్పకుండా తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సురక్షితంగా ఉంటారని రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అంటూ ఇటీవల ప్రచార కార్యక్రమాలలో లోకేష్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

































