క్యాబ్ డ్రైవర్‌ను 22సార్లు చెంప పగల గొట్టింది. ఆపై దర్జాగా తప్పించుకునేందుకు దబాయించింది. చివరికి అడ్డంగా దొరికి నవ్వులు పాలైంది. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోకి చెందిన ప్రియదర్శిని అనే యువతి రోడ్డు దాటుతుండగా క్యాబ్ డ్రైవర్ సాదత్ అలీ సిద్ధిఖీ తనని యాక్స్‌డెంట్ చేసేందుకు ప్రయత్నించాడంటూ సదరు యువతి క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేసింది. దాడి సమయంలో స్థానికులు ఆమెను వద్దని వారించే ప్రయత్నం చేస్తుంటే.. ప్రియదర్శిని రివర్స్ అయ్యింది. దీంతో ఏం చేయాలో పాలు పోని వాహనదారులు సైలెంట్ అయ్యారు.

దీంతో ఈ ఇన్సిడెంటే దేశ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. అయితే ఈ ఘటనలో తన తప్పులేదని క్యాబ్ డ్రైవర్ వాపోతున్నాడు. యువతి మాత్రం నేనేం తప్పు చేయలేదు. కావాలంటే సీసీటీవీ పుటేజ్ చెక్ చేయాలని దబాయించింది.దీంతో నెటిజన్లు క్యాబ్ డ్రైవర్‌కు సపోర్ట్ చేస్తూ #arrestlucknowgirl పేరుతో హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు.
CCTV से ऐसा लग रहा है कि ये लड़की इस गरीब टैक्सी चालक को इतनी बुरी तरह से पीट रही है क्यूंकि उसने गाड़ी नहीं रोकी! ये बेहद शर्मनाक है. किसने अधिकार दिया इस लड़की को मारपीट करने का? इस मामले में @Uppolice जांच करे और कानून को हाथ में लेने के अपराध में महिला पर कड़ी कार्यवाही हो. pic.twitter.com/IrVUKkeINC
— Swati Maliwal (@SwatiJaiHind) August 2, 2021
ఒత్తిడి పెరగడంతో యువతి చేసిన రచ్చపై పోలీసులు విచారణ చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో సీసీటీవీపుటేజీలను చెక్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టోటల్ మొత్తం ఇన్సిడెంట్‌లో క్యాబ్ డ్రైవర్ తప్పులేదని, ఇష్టానుసారంగా రోడ్డు దాటేందుకు యువతి ప్రయత్నించిందని తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.































