సాధారణంగా మద్యం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనకు ఎన్నిసార్లు చెప్పినా మద్యం తాగడం మాత్రం మానడం లేదు. ఈ క్రమంలోనే ఏదైనా పార్టీలకు వెళ్లినప్పుడు చాలా మంది మందు తాగుతూ ఉంటారు. అయితే మందుతో పాటు కొన్ని పదార్థాలను స్టఫ్ గా తీసుకుంటారు.అయితే మద్యం తాగే టప్పుడు మందుబాబులు పొరపాటున కూడా మద్యంతో ఈ పాటు ఆహార పదార్థాలను తినకూడదు అని నిపుణులు చెబుతున్నారు. మద్యంతో పాటు ఈ పదార్థాలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి కడుపులో తీవ్రమైన మంట, చాతిలో నొప్పిని కలుగజేస్తుంది. కనుక ఈ ఆహార పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

మందుతో పాటు పొరపాటున కూడా చాక్లెట్ తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాక్లెట్ మందుతో పాటు తినటం వల్ల మన కడుపులో ఆమ్లత్వాన్ని పెంచుతుంది. తద్వారా ఎక్కువ గ్యాస్ ఏర్పడుతుంది. మందుతో పాటు చాలామంది చిక్కుడు విత్తనాలను ఉప్పు కారం వేసి తింటారు. ఇలా తినడం మొదటికే మోసం వస్తుంది.
చిక్కుడు గింజలలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కనుక మందుతో పాటు చిక్కుడు గింజలు తీసుకోవడం వల్ల మన శరీరంలో ఐరన్ కలవక అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.మందు బాబులు మందు తాగే టప్పుడు ఎక్కువగా ఉప్పు కారం ఉండే ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడతారు.ఇలా అధికంగా ఉప్పు వేసిన ఆహార పదార్థాలను తినటం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కు గురి కావడమే కాకుండా శక్తిని కూడా కోల్పోతుంది. కనుక వీలైనంత వరకు చికెన్, చిప్స్ వంటి అధికంగా ఉప్పు కలిగిన వాటిని దూరంగా పెట్టండి.
మద్యం తాగేవారు మద్యంతో పాటు పొరపాటున కూడా బ్రెడ్ తీసుకోకూడదు. మద్యంతో పాటు బ్రెడ్ తినడం వల్ల
అపానవాయువు వస్తుంది. దీని ద్వారా మీలో డీహైడ్రేట్ అవ్వడమే కాకుండా కొన్నిసార్లు వాంతులు కూడా కలగవచ్చు. కనుక మందు తాగేటప్పుడు పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలతో కలిపి తాగకూడదు. ఇలా తాగడం వల్ల అనేక సమస్యలు మనల్ని చుట్టుముడతాయని నిపుణులు చెబుతున్నారు.































