వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. మంత్రులు సచివాలయానికి రారు.. శాఖాధిపతుల అసలే రారని ఎద్దేవా చేశారు. శాఖాధిపతి లు విధిగా హాజరు కావాలన్న సీఎం జగన్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సలహాదారులు పాలన కొనసాగిస్తున్నారని అశోక్ బాబు ఆరోపించారు.

కాగా ఉద్యోగులకు జీతం రాకున్నా ఉద్యోగ సంఘాలు ఇప్పటికీ మౌనం వీడక పోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ లో ప్రజల అర్జీలకు సమాధానం చెప్పే వారేలేరన్నారు అశోక్ బాబు.


































