పసిడి ప్రియులకు శుభవార్త.. ప్రభుత్వ నిర్ణయంతో వారికి చుక్కలే..?

0
313

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగారాన్ని అమితంగా ఇష్టపడే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గోల్డ్ హాల్‌మార్కింగ్ నిబంధనలను కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయనుంది. 2021 సంవత్సరం జూన్ నెల 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. కేంద్రం ఈ ఏడాదే ఈ నిబంధనలను అమలు చేయాలని ప్రయత్నించినా కొన్ని కారణాల వల్ల నిర్ణయం అమలులోకి రాలేదు.

జువెలరీ సంస్థలు బంగారం కొనుగోలు చేసేవాళ్లను మోసం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త కన్సూమర్ ప్రొడక్షన్ యాక్ట్ ను కేంద్రం అమలులోకి తీసుకొస్తోంది. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే కొనుగోలుదారులు మోసపోయే అవకాశాలు ఉండవు. జువెలర్లు కొనుగోలుదారులను మోసం చేస్తే కఠిన శిక్షలు అమలులోకి వస్తాయి. 22 క్యారెట్ల బంగారానికి బదులుగా 18 క్యారెట్లు అమ్మితే కఠిన శిక్షలు అమలవుతాయి.

కేంద్రం ఖచ్చితంగా వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనలను అమలులోకి తెస్తామని ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు బంగారం కొనుగోలు సమయంలో కొనుగోలుదారులు మోసపోయినా ఇకపై మోసపోవడానికి అవకాశం ఉండదు. జైలుశిక్ష పడే అవకాశం ఉండటంతో జువెలరీ సంస్థలు సైతం మంచి ఉత్పత్తులను విక్రయించడానికే ఆసక్తి చూపుతాయి.

జువెలరీ సంస్థలు బీఐఎస్ కింద రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే బంగారం అమ్మడానికి అర్హులవుతారు. ప్రస్తుతం గోల్డ్ హాల్ మార్కింగ్ ను బీఐఎస్ మాత్రమే వేస్తోంది. హాల్ మార్కింగ్ ఉన్న నగలను విక్రయించిన సమయంలో కూడా మంచి రేటుకు అమ్ముడుపోయే అవకాశం ఉంది. అందువల్ల అలాంటి వాటిని తీసుకోవడం మంచిది.