మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. 2 లక్షల కోట్లతో కొత్త స్కీమ్..?

0
244

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా, లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రంగాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా పీఎల్‌ఐ స్కీమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సె‌న్‌టివ్ స్కీమ్‌ పేరుతో కేంద్రం అమలులోకి తీసుకురానున్న ఈ స్కీమ్ ద్వారా ముఖ్యంగా 10 రంగాలకు ప్రయోజనం చేకూరనుంది.

కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం ఏకంగా 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం గమనార్హం. ఈ స్కీమ్ ద్వారా కరోనా వల్ల భారీగా నష్టాలను మూటగట్టుకున్న వాహన రంగానికి, వాహన విడిభాగాల రంగానికి కేంద్రం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. కేంద్రం రాబోయే 5 సంవత్సరాల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. వాహనాలు, వాహనాల విడిభాగాల కోసం కేంద్రం 50,000 కోట్ల రూపాయలు కేటాయించడం గమనార్హం.

ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సె‌న్‌టివ్ స్కీమ్ ద్వారా కేంద్రం ఎక్కువ మొత్తంలో తయారు చేసిన ఉత్పత్తులకు రాయితీలను అందించడంతో పాటు విదేశాల ఎగుమతులకు సంబంధించిన నిబంధనల్లో కూడా మార్పులు వేస్తుంది. కేంద్రం రాబోయే 5 సంవత్సరాల్లో 1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్రం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సె‌న్‌టివ్ స్కీమ్ ద్వారా టెక్నాలజీ ఉత్పత్తులు, టెలీకాం అండ్ నెట్ వర్క్, వైట్ గూడ్స్, ఫుడ్ ప్రొడక్షన్, ఫార్మాస్యూటికల్స్, అడ్వాన్ సెల్ కెమిస్ట్రీ బ్యాటరీ రంగాలకు ప్రయోజనం చేకూర్చనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టినట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here