అశ్లీల చిత్రాల కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు రూ .50 వేల పూచీకత్తుపై బెయిల్ లభించింది. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాలు నిర్మించడం, వాటిని విక్రయించడం వంటి ఆరోపణలతో పోలీసులు జులై 19న అరెస్ట్ చేశారు.

అతనిపై భారతీయ శిక్షాస్మృతి మరియు సమాచార సాంకేతికత చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడిన విషయం తెలిసిందే. అప్పటినుంచి జైలులో ఉన్న రాజ్ కుంద్రాకు ఇప్పుడు బెయిల్ లభించింది. అరెస్టైన రెండు నెలల తర్వాత బెయిల్ రావడంతో కుంద్రా బయటకు రానున్నారు. ఇటీవలే రాజ్ కుంద్రాపై ముంబయి పోలీసులు 1,400 పేజీల భారీ చార్జిషీటు దాఖలు చేశారు.
ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని, చార్జిషీటు కూడా దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇకనైనా తనకు బెయిల్ మంజూరు చేయాలని అర్థించారు. అసలు ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని వాపోయారు. బ్రిటన్ సిటిజన్ గా ఉన్న రాజ్ కుంద్రా దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందంటూ పోలీసులు భావించగా.. ఇప్పటికే ఎన్నోసార్లు కుంద్రా బెయిల్ నిరాకరించారు. ఈ క్రమంలోనే కుంద్రా పాస్ పోర్ట్ కూడా స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ కేసులో ముఖ్యుడు అతడే అని.. మరికొంత మంది వ్యక్తులతో కలిసి యువతులను మభ్యపెట్టి అశ్లీల చిత్రాల రొంపిలోకి దించేవారని పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురైన యువతులను టార్గెట్ చేసినట్లు వెల్లడించారు. ఏదేమైనా బెయిల్ లభించిన కుంద్రా వైవాహిక జీవితం అంతకు ముందు ఉన్నట్లు ఉంటుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తం అవున్నాయి.
































