Varun Sandesh: తాను తన భార్య వితికకు చాలా గౌరవం ఇస్తానని ప్రముఖ నటుడు వరుణ్ సందేశ్ అన్నారు. కానీ బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చాక మాత్రం కొన్నిసార్లు తాను చాలా బాధ పడిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా చూపించారు, ఇలా ఎడిట్ చేసారేంటీ అని ఫీలైనట్టు వరుణ్ సందేశ్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.

కానీ ఏదేమైనా అది ఒక రియాలిటీ షో. ఇది వేయండి, అది వేయండి అని చెప్పలేం కదా.. 24 గంటలు ఎలాగూ చూపించలేరు. కాబట్టి ఉన్నదాంట్లో ఒక గంట చూపించారని వరుణ్ సందేశ్ తెలియజేశారు.ఇకపోతే వితిక బయటకు వచ్చాక తనకు కొందరు అసభ్యంగా మెసేజెస్ పెట్టారని వరుణ్ సందేశ్ అన్నారు. అవి తనకు కూడా చూపించిందని, దానికి తాను చాలా బాధ పడ్డానని ఆయన చెప్పారు.

ఒక మనిషిని కేవలం ఒక గంట చూసి వాళ్ళ క్యారక్టర్ ని ఎలా డిసైడ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. తను కూడా బయటికి వచ్చాక ఆ మేసేజెస్ వల్ల చాలా ఎఫెక్ట్ అయిందని ఆయన అన్నారు. అసలు వాళ్ళను ఏమని తిట్టాలో కూడా అర్దం కావడం లేదని వరుణ్ సందేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వితిక చాలా స్ట్రాంగ్ ఉమెన్..
నిజం చెప్పాలంటే తను చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని, నిజంగానే సూపర్ ఉమెన్ అని వరుణ్ అన్నారు. ఇప్పుడు వితిక ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టింది. అది కూడా చాలా సక్సెస్ గా రన్ అవుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఎమోషనల్ సపోర్ట్ ఐనా, మెంటల్ సపోర్ట్ ఐనా తనే ఎక్కువ ఇస్తుందని చెప్పారు. అప్పర్ హ్యాండ్, లోయర్ హ్యాండ్ అని ఎవరూ లేరని ఇద్దరిదీ ఒకే మాట అని వరుణ్ సందేశ్ స్పష్టం చేశారు.