Namratha Mahesh Babu : మహేష్ కి ఉన్న ఆ అలవాటు అంటే పరమ అసహ్యం అంటున్న నమ్రత…!

0
581

Namratha Mahesh Babu : టాలీవుడ్ లో టాప్ హ్యాండ్సమ్ హీరో అంటే మన ప్రిన్స్ మహేష్ బాబు అని టక్కున చెప్పొచ్చు. నాలుగు పదుల వయసు దాటతున్నా వయసు తగ్గుతోందే కాని ఎక్కడం లేదు ప్రిన్స్ కి. ఇక సినిమాల విషయానికి వస్తే మొదట్లో కాస్త తడబడినా ప్రస్తుతం మాత్రం ఫ్లాప్ అనే మాటే లేకుండా వరుసగా హిట్లు కొట్టుకుంటూ నిజంగానే ఇండస్ట్రీకి ప్రిన్స్ నేను అంటున్నాడు మహేష్. అలాంటి మహేష్ ను ప్రేమించి దక్కించుకున్న హీరోయిన్ నమ్రత కు మహేష్ లో ఒక అలవాటు అస్సలు నచ్చదట. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం.

మహేష్ కు ఆ అలవాటు మాన్పించడం కృష్ణ వల్లే కాలేదు…

మహేష్ ఎంతో అందంగా ఉంటాడు, అలానే అందంగా మాట్లాడుతాడు కూడా. అయితే మహేష్ ఒక స్మోకర్. నిజానికి చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు కానీ ఒకప్పట్లో మహేష్ బాగా పొగ తాగేవాడట. ఆ అలవాటు మాన్పించడానికి వాళ్ళ అమ్మ ఇందిరా గారు చాలా ప్రయత్నించినా మహేష్ మాత్రం ఆ అలవాటును వదల్లేదు. ఇక మా నాన్నే నా సూపర్ హీరో అని చెప్పే మహేష్ తన తండ్రి కృష్ణ గారు ఎంత వారించినా స్మోకింగ్ హ్యాబిట్ వదల్లేక పోయాడట.

అసలే స్మోకింగ్ చేసే అబ్బాయిలంటే చాలా మంది అమ్మాయిలు ఇష్టపడరు. అలాంటిది నమ్రతకు కూడా స్మోకింగ్ చేసేవాళ్లంటే పరమ అసహ్యమట. దీంతో పరిచయమైన కొద్దికాలానికే ఆ విషయాన్ని నెమ్మదిగా చెప్పిందట నమ్రత. ఇక ప్రేమించిన అమ్మాయికి నచ్చని పని ఏ ప్రేమికుడు మాత్రం చేస్తాడు. దెబ్బకు మహేష్ స్మోకింగ్ హ్యాబిట్ ను మానుకుని జెంటల్ మెన్ అయిపోయాడు. ప్రస్తుతం మహేష్ నమ్రతకి సంబంధించిన ఈ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.