ప్రజలకు శుభవార్త.. ఈ బ్యాటరీతో ఛార్జింగ్ కష్టాలు తీరినట్లే..!

0
179

మనలో చాలామంది స్మార్ట్ ఫోన్ల విషయంలో బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడేవాళ్లు, యూట్యూబ్ వీడియోలు చూసేవాళ్ల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వ్యక్తమవుతూ ఉంటాయి. ఎక్కువ దూరం ప్రయాణం చేసేవాళ్లు సైతం ఛార్జింగ్ కష్టాలు అనుభవించే ఉంటారు. అయితే ఈ బ్యాటరీని ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ పని చేస్తుంది.

ఇర్విన్ లోని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్త, పీహెచ్డీ విద్యార్థి ఒక వస్తువు కోసం ప్రయోగాలు చేస్తూ అనుకోకుండా ఈ బ్యాటరీని కనిపెట్టారు. నానో వైర్లతో తయారు చేసిన ఈ బ్యాటరీలో ఛార్జింగ్ దశాబ్దాల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సాధారణంగా స్మార్ట్ ఫోన్లలో లిథియం అయాన్ బ్యాటరీలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ బ్యాటరీలలో ఛార్జింగ్ కొన్ని గంటల వరకు మాత్రమే ఉంటుంది.

గత కొన్నేళ్ల నుంచి శాస్త్రవేత్తలు లైఫ్ లాంగ్ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేని బ్యాటరీల కోసం ప్రయోగాలు చేస్తున్నారు. మ్యా లే థాయ్ అనే విద్యార్థి , యూనివర్సిటీ శాస్త్రవేత్తతో కలిసి 100 నానో మీటర్ల కంటే అతిచిన్న పరిమాణం కలిగిన వైర్లతో బ్యాటరీని తయారు చేశాడు. శనగ వెన్న మాదిరిగా ఉండే జెల్ ను ఈ బ్యాటరీలో వినియోగిస్తారు. ఇలాంటి బ్యాటరీలకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటి బ్యాటరీలు ప్రజల ఛార్జింగ్ కష్టాలను కూడా సులభంగా తీరుస్తాయి. నానోవైర్ బ్యాటరీలు చాలా సంవత్సరాల మన్నిక ఇస్తాయి. 2021 నుంచి ఈ బ్యాటరీలో మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2026 నాటికి ఈ బ్యాటరీలు 243 మిలియన్ డాలర్ల మార్కెట్ ను సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here