Naresh: పెళ్లి అనేది రెండు మనసుల కలయిక… సీనియర్ నరేష్ కామెంట్స్ వైరల్!

0
37

Naresh: సీనియర్ నటుడు నరేష్ ఇదివరికి మూడు పెళ్లిళ్లు చేసుకుని తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా మూడు పెళ్లిళ్ల తర్వాత ఆ మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో ఈయన తిరిగి నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నారు.త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి..

ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నరేష్ పెళ్లిల గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక వీళ్ళిద్దరూ సహజీవనంలో ఉండగా చాలామందికి వీరిద్దరు నిజంగానే సహజీవనంలో ఉన్నారా లేక పెళ్లి కూడా చేసుకున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలోనే నరేష్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ… ప్రస్తుత కాలంలో వైవాహిక వ్యవస్థ కూలిపోతుందని తెలిపారు. ఇన్ని ఫ్యామిలీలు కోర్టుకు వచ్చాయి అంటే దాని అర్థం అదేనని నరేష్ తెలిపారు. కానీ మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా వివాహ వ్యవస్థను గౌరవిస్తూ ఈ సినిమా చేశామని తెలియజేశారు.మనం పెళ్లి ఏ సాంప్రదాయ పద్ధతిలో చేసుకున్నప్పటికీ పెళ్లి అనేది కేవలం రెండు మనసుల కలయిక మాత్రమేనని తెలిపారు.

Naresh: దాదాపు మాకు పెళ్లి అయిపోయినట్టే…

ఇలా రెండు మనసులు కలిస్తే దాదాపు పెళ్లి అయిపోయినట్టేనని ఈ సందర్భంగా నరేష్ తెలియజేశారు. ఇక పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా దాదాపు పెళ్లి చేసుకున్నట్టేనని అర్థం వచ్చే విధంగా నరేష్ మాట్లాడగా పక్కనే ఉన్నటువంటి పవిత్ర లోకేష్ సైతం అవును అనేలాగే తల ఊపడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనీ అర్థమవుతుంది.ఇక వీరిద్దరూ మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా నరేష్ వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా తెరకెక్కినట్టు తెలుస్తుంది.