కొరియోగ్రాఫర్ నటరాజ్ అంటే కొంతమందికే తెలిసి ఉంటుంది. ఎప్పుడైతే అతడు బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టడంతో అతడి గురించి చాలామందికి తెలిసింది. అంతేకాకుండా అంతడు హౌస్ లోకి వెళ్లేముందు కూడా అతడు తన భార్యను చూసి.. ఆమె ప్రెగ్నెంట్ అంటూ చెప్పుకుంటూ.. భావోద్వేగానికి గురై వెళ్తాడు.

ఆమె 7 నెలల ప్రెగ్నెంట్ అంటూ చెబుతాడు. బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చిన సమయంలో తనకు ఇష్టం లేదని.. తన భార్యను వదిలి వెళ్లాల్సి వస్తుందన్న కారణంతో వెళ్లను అని చెప్పాటడ. దానికి తన తన భార్య నీతూ ఫోర్స్‌తోనే బిగ్‌బాస్ లోకి వెళ్తున్నట్లుగా నటరాజ్ మాస్టర్ వెల్లడించాడు. తన బిడ్డ లోకంలోకి రాగానే తన చూడలేకపోవచ్చు… కానీ బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచి ఇంటికి వెళ్తానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా అతడు కూడా హౌస్ లో తన భార్యను గుర్తు చేసుకుంటూ కొన్ని సందర్బాల్లో కన్నీరు పెట్టుకున్నారు కూడా.
అయితే ఇటీవల నటరాజ్ మాస్టార్ భార్య నీతూ సీమంతం జరిగింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కి బుల్లితెర తారలు.. నవీన, శ్రీవాణి, అంజలి పవన్, జ్యోతి రెడ్డి తదితరులు వచ్చి సందడి చేశారు.
కాగా నీతూ సీమంతానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన నటరాజ్ మాస్టర్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరితో కలిసి పనిచేశారు. 2009లో తన శిష్యురాలు నీతూని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అతను తన భార్య నీతూతో కలిసి టీవీ షోలు, ఆడియో మరియు అవార్డు ఫంక్షన్లు వంటి 200 కి పైగా కార్యక్రమాలు చేశారు. కాగా రెండో వారం హౌస్ లో బెస్ట్ పర్ ఫార్మర్ గా రుజువు చేసుకున్న విషయం తెలిసిందే.































