ఎన్టీఆర్ నటించిన ఇప్పటికి విడుదల కానీ సినిమాలో ఏదో తెలుసా?

0
360

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా తారక్ సంపాదించుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ హీరోగా అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 30 సినిమాలకు చేరువయ్యాడు. ఎన్టీఆర్ తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి తాను నటించిన సినిమాలలో ఒక సినిమా ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ఇంతకీ ఆ సినిమా ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా రామాయణం సినిమాలో రాముని పాత్ర ద్వారా రంగప్రవేశం చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటి సారిగా కెమెరా ముందు కనిపించింది సీనియర్ ఎన్టీ రామారావు హిందీలో నటించిన”బ్రహ్మర్షి విశ్వామిత్ర” ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ భరతుడి పాత్రలో చేశారు.

బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తెలుగు వెర్షన్ లో బాలకృష్ణ హరిశ్చంద్రుడు, దుశ్యంతుడు పాత్రలలో నటించారు. హిందీలో కూడా బాలకృష్ణ దుష్యంతుడి పాత్రలో నటించారు. ఈ దుశ్యంతుడు కొడుకు భరతుడి పాత్రలో తారక్ సందడి చేశారు. తెలుగులో విడుదలైన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో, ఈ సినిమా హిందీ వెర్షన్ లో విడుదల చేయకుండా సీనియర్ ఎన్టీఆర్ హోల్డ్ లో పెట్టారు.

కొన్ని రోజుల తర్వాత సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావడంతో ఎంతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా గురించి పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు సీనియర్ ఎన్టీఆర్ మరణించడంతో ఇప్పటికీ హిందీ వర్షంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా విడుదలకు నోచుకోలేదని చెప్పవచ్చు. ఈ విధంగా నందమూరి ముగ్గురు హీరోలు నటించిన ఈ సినిమా ఇప్పటికీ విడుదల కాకపోవడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here