Parvathi : జీ తెలుగులో ప్రసారమయ్యే సరిగమప సింగర్స్ షో ద్వారా తెలుగు తెరకు పరిచయమైన దాసరి పార్వతిది మారుమూల కుగ్రామమైన లక్క సాగరం. బస్సు సౌకర్యం కూడా లేని ఊరికి పార్వతి తన ‘ఊరంతా వెన్నెల మనసంతా చీకటి’ అంటూ తన మొదటి పాటతోనే ఊరికి బస్సు వేయించింది. ఇక తన గాత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన పార్వతి చాలా తక్కువ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

పార్వతి ఎలిమినేషన్… మళ్ళీ రీ ఎంట్రీ….

ఇక మధ్యలో సాధన తగ్గిందో ఏమో తెలియదు కానీ పార్వతి పాట శృతి తప్పింది దీంతో పర్ఫార్మెన్స్ సరిగా ఇవ్వకపోవడం వల్ల కార్యక్రమం నుండి ఎలిమినేట్ అయింది. ఇక పార్వతి షో నుండి నిష్క్రమించడంతో ఆమె అభిమానులు చాలా బాధపడ్డారు. ఇక పార్వతి సింగర్ గా తెలుగు ఇండస్ట్రీ లో సెటిల్ అవుతుంది అనుకుంటే ఇలా అర్ధంతరంగా తన పాట ప్రయాణం ఆగిపోయినదాని చాలా మంది అనుకున్నారు. కానీ జీ సరిగమప వారు మళ్ళీ రీ ఎంట్రీ అంటూ నిష్క్రమించిన కంటెస్టెంట్స్ కు ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా మళ్ళీ షో లో పాల్గొనే అవకాశం ఇచ్చారు.
నీకేం కావాలన్నా నా దగ్గరకి రావొచ్చు.. ఎస్పి శైలజ…

ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ఓటింగ్ తో టాప్ 6 కంటెస్టెంట్స్ అయిన పార్వతి, కీర్తన, అర్జున్ విజయ్, షేక్ రసూల్, కళ్యాణి, చరణ్ తేజ్ లను షో కి తీసుకున్నారు. ఈ షో ఆదివారం ప్రసారమైంది. మళ్ళీ పార్వతి గొంతు షోలో వినిపించింది. ఇక పాట పాడాక ఎస్పి శైలజ పార్వతితో మాట్లాడుతూ సాధన పై దృష్టి పెట్టు, సన్మానాలు వంటి వాటిని మళ్ళీ చూసుకో నీకు సంగీతం విషయంలో ఏం సహాయం కావాలన్నా నా దగ్గరకు ఎపుడైనా రావొచ్చు అందుబాటులో ఉంటాను.. అంటూ చెప్పడంతో పార్వతి అభిమానులు ఖుషి అవుతున్నారు. ఖచ్చితంగా పార్వతి టైటిల్ విన్ అవుతుందని ఆశిస్తున్నారు.


































