Pavitra Lokesh: నటుడు నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరూ వీరి వ్యవహార శైలి కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. విజయనిర్మల వారసుడిగా నరేష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఈయన వ్యక్తిగత విషయాల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈయన ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురు భార్యలను విడిచిపెట్టి, నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నారు.

ఇక నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వకుండా ఈయన పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉండటం వల్ల వీరి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రమ్య రఘుపతి తనకు విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ తో పెళ్లికి ఎలా సిద్ధమవుతారంటూ ఈమె పెద్ద ఎత్తున గొడవకు దిగారు.

ఈ విధంగా వీరి మధ్య వివాదం ముదిరి ఏకంగా చెప్పులతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఇకపోతే ఈ వివాదం ముగిసింది అనుకునే లోపు మరోసారి నటి పవిత్ర లోకేష్ తన గురించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అసభ్యంగా వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.ఈ క్రమంలోనే తనవి నరేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి తనని అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఈమె ఫిర్యాదు చేయడమే కాకుండా ఈ వ్యవహారం వెనుక నరేష్ మూడవ భార్య రమ్య ఉన్నారంటూ ఆరోపించారు.

Pavitra Lokesh: అసత్య వార్తల ప్రచారం వెనుక రమ్య హస్తముంది…
నరేష్ రమ్య మధ్య ఏవో కుటుంబ గొడవలు ఉన్నాయి. వీటిని అడ్డుపెట్టుకొని ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ఫోటోలను మార్ఫింగ్ చేసి తన గురించి అసత్య వార్తలను ప్రచారం చేయిస్తున్నారంటూ ఈమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం కాస్త మీడియా వార్తలలో వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై రమ్య రఘుపతి ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.































