గత కొద్ది రోజుల క్రితం చైనాలో లాంచ్ అయిన రెడ్ మీ కే 40 గేమింగ్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో పోకో ఎఫ్3 జీటీగా లాంచ్ అయ్యే అవకాశం ఉందని ప్రముఖ టిప్ స్టర్ తెలిపారు. ఈ రెండు ఫోన్లు ఒకే మోడల్ నంబర్ కలిగి ఉన్నాయి. అయితే ఈ పోకో ఎఫ్3 జీటీ ఇండియాలో లాంచ్ అయ్యే విషయాన్ని షియోమీ మాత్రం దీని గురించి ఎటువంటి ప్రకటనా చేయలేదు.

రెడ్ మీ కే40 గేమింగ్ ఎడిషన్‌లో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.ట్యూన్డ్ ఆడియో, మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్, షోల్డర్ బటన్లు ఇందులో ఉన్నాయనే విషయాన్ని టిప్ స్టర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్ ఫోన్ M2104K10I మోడల్ నంబర్‌తో కనిపించిందని టిప్ స్టర్ పేర్కొన్నారు.
ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెట్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ ఏకంగా 480 హెర్ట్జ్‌గానూ ఉంది. హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.5065 ఎంఏహెచ్ బ్యాటరీ,67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది.
ఇక కెమెరాల విషయానికొస్తే వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్ కాగా,8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీ వీడియో కాల్ కెమెరా కోసం 16 మెగాఫిక్సల్ కెమెరా ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 205 గ్రాములుగా ఉంది































