మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫోటోలు వైరల్!

0
68

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పూజా హెగ్డే పేరు మార్మోగిపోతోంది. వరుస హిట్లను అందుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ బుట్ట బొమ్మ. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చక్రం తిప్పుతూ ఉంది. ఇటీవలే ఆమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అలాగే ప్రభాస్ సరసన నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈమె చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆమె పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే షూటింగులకు కాస్త బ్రేక్ ఇచ్చి ఆ విరామ సమయాన్ని ఆస్వాదించే పనిలో పడింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే పూజా హెగ్డే మాల్దీవుల పర్యటనకు పయనమైంది. ఇక ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫోటోలతో పాటు విమానంలో పయనిస్తున్న వీడియోలతో సహా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది .

ఈ సందర్భంగా పూజ విరామం తీసుకునే సమయం ఇది..ఆ తరువాత ఏంటో చూడండి అంటూ మాల్దీవుల పేరుతో ఉన్న హ్యాష్ ట్యాగ్ ను జత చేసింది. ఇక మాల్దీవుల దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాల్దీవుల సమీపంకు రాగానే విమానం నుంచి మాల్దీవుల ప్రాంతాన్ని స్టన్నింగ్ వీడియో ని సైతం ఆమె పంచుకుంది.

ఒకవైపు అక్కడ ఉన్న వేకెషన్స్ ను ఎంజాయ్ చేస్తూనే మరొకవైపు, అక్కడ ఉన్న అందమైన ప్రదేశాలను ప్రతిక్షణం సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులకు కూడా కనువిందు చేస్తోంది. ఈ వెకేషన్ పూర్తి అయిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలుగు, తమిళ ప్రాజెక్టులను తిరిగి స్టార్ట్ చేయనుందని ఆమె సన్నిహిత వర్గాల సమాచారం. ఇలా పూజా హెగ్డే తన అందంతో, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూనే కొత్త కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్లో దూసుకుపోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here