నాగార్జున కూడా అలాంటి వాడే.. సంచలనంగా మారిన పంజాబీ అమ్మాయి ట్వీట్..!

0
44722

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో కనిపించి సందడి చేసిన పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాలలో తక్కువ కనిపించిన సోషల్ మీడియాలో ఈమె హడావిడి ఎక్కువగా ఉంటుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పంజాబీ అమ్మాయిని మోసం చేశాడంటూ ఈమె పేరును ప్రస్తావించడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ విషయంలో పూనమ్ కౌర్ పేరు రావడంతో ఈమె ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో స్పందిస్తుంది. అసలు ఈమె చేసే ట్వీట్లు ఎవరిని ఉద్దేశించి చేస్తుందో కూడా అర్థం కావు. ఇక సమయం సందర్భానుసారం అంటూ ఏమీ ఉండదు.ఈమె ట్వీట్ చేసిందంటే ఏదో ఒక వివాదానికి తెరలేపింది అని అర్థం.ఈమె ట్వీట్ చూసిన నెటిజన్లు అసలు ఈమె ఎవరి గురించి ఏం చెప్పాలనుకున్నారో తెలియక తికమక పడుతుంటారు.

ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం పూనమ్ తన ట్విట్టర్ ద్వారా మా ఎన్నికలలో భాగంగా తను ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు.ప్రకాష్ రాజ్ గెలిస్తే తన ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సమస్యలన్నింటినీ బయటపెడతానని చెప్పిన ఈమె తాజాగా మరొకసారి ట్విట్టర్ ద్వారా స్పందించారు. అయితే ఈసారి అక్కినేని నాగార్జున గురించి ట్వీట్ చేయడం గమనార్హం.

ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున గురించి ఈమె ట్వీట్ చేస్తూ…. ఎంతో డిగ్నిటీ,గ్రేస్, దయ ఉన్న మంచి మనుషుల్లో నాగార్జున సర్ ఒకరు.. అలాంటి మంచి వ్యక్తి కుటుంబానికి ఏమి జరగకూడదు వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అంటూ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ నాగార్జున, పూనమ్, ప్రకాష్ రాజ్ ఉన్నటువంటి ఫోటోను షేర్ చేశారు.ప్రస్తుతం ఈమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు మధ్యలో నాగార్జున గారు ఎందుకు వచ్చారు అంటూ ఆరా తీస్తున్నారు. బహుశా మా ఎన్నికలలో భాగంగా ఇలా ప్రచారం చేస్తున్నారేమో అంటూ కొందరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.