ప్రముఖ నటి పూనమ్ కౌర్ ఎస్‌వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన ‘మాయాజాలం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా తర్వాత..అడపాదడపా పలు సినిమాల్లో నటించింది. కానీ ఏ సీనిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. తర్వాత ఆమె చేసే సినిమాలు హీరోయిన్ పాత్రలను వదిలేసి.. హీరోయిన్ కు సైడ్ క్యారెక్టర్ లేదా సిస్టర్ క్యారెక్టర్లు చేస్తూ ఉంది.

అది కూడా గత కొంత కాలంగా వెండితెరకూ దూరంగా ఉంటూ వస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆమె వేసే ప్రతి ట్వీట్‌పై, పెట్టే ప్రతి పోస్ట్‌పై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తుంటారు. ఆమె తన అభిప్రాయాలను, ఫొటోలు, వీడియోలను ఫాలోవర్స్ తో పాటు.. ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు.
తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అయింది. ఆమె విడాకుల అంశంపై ఓ విశ్లేషణాత్మక ప్రశ్నలను లేవనెత్తారు. అదేంటంటే.. ‘ విడాకుల అనంతరం పెయిన్ అనేది ఆడవాళ్లకు మాత్రమే ఉంటదా.. మగవాళ్లకు ఉండదా.. ఆడవాళ్లే వారిని మాటలతో బాధిస్తారు..వారి వల్లే మగవారికి కఠిన పరిస్థితులు వస్తుంటాయని ఈ సొసైటీ పక్షపాత ధోరణితో ప్రొజెక్ట్ చేస్తుందా.. ఇప్పటికీ మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా? విడాకుల కోణంపై మనకు కచ్చితమైన దృక్కోణం ఉందా?” అని పూనమ్ రాసుకొచ్చింది.

అయితే ఈ ట్వీట్ చేసిన గంట వ్యవధిలోనే పూనమ్ పోస్ట్‌ను డిలీట్ చేయడం గమనార్హం. అసలు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసింది..? ఎందుకు డిలీట్ చేసింది..? విడాకుల అంశంపై ఇంత లోతైన పోస్ట్ పెట్టి డిలీట్ చేయడం పట్ల ఆంతర్యం ఏంటన్నది అర్థం కావడం లేదు.































