Pranitha Subhash : పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోర్కి అనే కన్నడ సినిమాతో సినిమాలకి పరిచయం అయింది ప్రణీత. ‘ఎం పిల్లో ఎం పిల్లడో’ సినిమా ద్వారా తెలుగు తెర కు పరిచయం అయ్యింది. అయితే 2021 వ సంవత్సరంలో కర్ణాటక కు చెందిన నితిన్ రాజు ని వివాహం చేసుకున్న విషయం తెలిదిందే. ఎప్పుడు సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటుంది ప్రణీత. 2022 june10 న పండంటి పాప కి జన్మనిచ్చింది. తనకు సంబందించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది.

తనపై ట్రోల్స్ కి దిమ్మ తిరిగే సమాధానం…
ఇటీవల ప్రణీత కొన్నిరోజుల క్రితం భీమన అమావాస్య పూజ సందర్భంగా భర్త నితిన్ రాజ్ కి పాదపూజ చేసి, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే సంప్రదాయాలకు విలువ ఇచ్చి భర్తకు పాద పూజి చేసినందుకు కొందరు నెటిజన్లు ఇంకా ఏ కాలంలో ఉందో అంటూ వెటకారంగా ట్రోల్ చేశారు. ఈ విమర్శలపై తాజాగా ప్రణీత స్పందించింది. మన జీవితంలో జరిగే అన్ని విషయాలకు రెండు కోణాలుంటాయి. 90 శాతం జనాలు పాజిటివ్ గా స్పందిస్తారు. మిగిలినవారు ఇలా నోటికొచ్చినట్లు వాడుతుంటారు. నా భర్త నా ఇష్టం ఇంకేవి నేను పట్టించుకోనని గట్టిగా సమాధానం చెప్పింది.

నటిగా గ్లామర్ ప్రపంచంలో ఉన్నంత మాత్రాన సాంప్రదాయాలకు విలువ ఇవ్వను అనుకుంటున్నారేమో… నేను చిన్నప్పటినుండి ఇలాంటివి చూస్తూ పెరిగాను, ఇలా నేను పెళ్లి అయిన కొత్తలో కూడా చేసాను. పోస్ట్ చేయలేదంతే. నేను మన సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇస్తాను. మోడరన్ గా ఉంటే మాత్రం వీటిని మరచిపోలేము కదా..అని ట్రోల్స్ కు చురకలు వేసింది.


































