Producer Thammareddy Bhardwaja : ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. వసూళ్ల పరంగా ప్రభాస్ సత్తా చూపుతుంటే మరోవైపు చాలా మందికి ఆదిపురుష్ లో రామాయణంను కొత్తగా చూపించిన తీరు నచ్చలేదు. రాముడికి మీసాలేంటి దగ్గర మొదలయిన వివాదం సినిమాలో హనుమంతుడు కొన్ని సన్నివేశాలలో వాడిన భాష అలాగే రావణుడి వేషధారణ ఆయన పది తలలు వరుసగా లేకుండా త్రికోణకారంలో ఉండటం వంటివి జనాలకు రుచించలేదు. ఇక ఈ సినిమా గురించి తాజాగా సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా హాట్ కామెంట్స్ చేసారు.

బాగోలేని సినిమాకు అంత టికెట్ ఎందుకని…
ఆదిపురుష్ సినిమాను చూసారా అంటూ ఒక ఇంటర్వ్యూలో తమ్మరెడ్డిని ప్రశ్నినించగా థియేటర్ కి వెళ్లాను కానీ టికెట్ ధర 330 ఉంది, అంత పెట్టి చూడాలా అని వెనక్కి వచ్చేసాను అంటూ చెప్పారు. సినిమా బాగోలేదని ఒకరిద్దరు కాదు చాలా మంది చెప్పారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. అయితే అది ఒక కమర్షియల్ సినిమా విషయంలో జరుగుతుంది. కానీ రామాయణం అందరికీ తెలిసిన కథ, ఆ కథ వింటూ పెరిగిన వాళ్ళం. అలాంటి కథను కొత్తగా తీసే ప్రయత్నంలో జనాలకు నచ్చలేదు.

సీతను రావణాసురుడు ఎత్తుకుపోయే సీన్ లో రాముడు వెనుక పరిగెత్తడం ఈ సినిమాలో ఉందని విన్నాను. సముద్రం దారి ఇవ్వకపోతే బాణం వేసి దారి చేస్తా అని సముద్రడినే బయపెట్టిన రాముడు ఒక్క బాణం వేసి రావణుడిని ఆపలేడా ఇలాంటి అర్థం పర్థంలేని సన్నివేశాలు ఎవరికీ నచ్చలేదు. మొదట రామాయణం తీస్తున్నామని చెప్పి ఇపుడు ఆ కథ నుండి స్ఫూర్తి పొందాం అని చెబుతున్నారు. అందుకే సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ రాలేదు. ఓటిటి లో విడుదల అయ్యాక చూద్దాంలే అనుకున్నా అంటూ చెప్పారు.

































