Rajamouli: సౌత్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు పొందిన సీనియర్ నటి కాంచన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న కాంచన వయసు పైబడిన కూడా ఇప్పటికీ అడపాదడపా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె ఒక దేవాలయంలో తన కాలం వెలదీస్తోంది.

ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు పొందిన కాంచన ఎన్నో ఆస్తులను కూడా పెట్టింది. అయితే ఆస్తి కోసం తన తల్లిదండ్రులు ఆమెను విషం పెట్టి హత్య చేయటానికి ప్రయత్నించారు. దీంతో ఆమె తల్లిదండ్రులను ఆయన వారిని కాదనుకొని ఒంటరిగా జీవిస్తూ తన ఆస్తి కోసం పోరాటం చేసింది. ఈ క్రమంలో కోర్టు ద్వారా ఆమెకు కొంత ఆస్తి సంక్రమించినప్పటికీ ఆమె ఆస్తి మొత్తం దేవాలయానికి దానం చేసి ఆ దేవాలయంలోని దైవ పూజ చేస్తూ అక్కడే జీవిస్తోంది.
ఇటీవల ఒక టీవీ ఛానల్ కాంచనని ఇంటర్వ్యూ చేయగా దర్శకుడు రాజమౌళి గురించి మాట్లాడుతూ రాజమౌళి తనని అవమానించాడని కాంచన సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..” రాజమౌళి బాహుబలి సినిమా కోసం రెండు రోజులపాటు తన డేట్స్ అడిగారని, అయితే రెండు రోజుల కోసం నేను 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసాను.

Rajamouli: అలాంటి స్థితిలో రాజమౌళి లేరు కదా…
అంత డబ్బు ఇవ్వలేమని చెప్పి రాజమౌళి నన్ను కాదని వేరే వాళ్ళని తీసుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది.
తన లాంటి ఒక సీనియర్ నటికి రూ.5 లక్షలు ఇవ్వలేని స్థితిలో రాజమౌళి లేరు కదా ? అని ప్రశ్నించారు. ఆ డబ్బు వారికి పెద్ద విషయమే కాదని.. తన లాంటి వారికి ఇస్తే ఎంతోమందికి ఉపయోగపడుతుందని ఆవిడ రాజమౌళి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలపై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.































