నటులు మంజుల,విజయ్ కుమార్ పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె తరచూ ఏదో ఒక వివాదం, పెళ్లిళ్ల ద్వారా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.అయితే మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనిత విజయ్ కుమార్ ఇక్కడితో తన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని అని అందరూ భావించినప్పటికీ ఈమె ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియాలో తీవ్ర వివాదాలకు కారణమవుతుంటాయి.

తాజాగా నటి వనిత మరో వివాదం ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ కేవలం మగవారి వల్లే ఆడవారికి వేధింపులు కలగవని కొత్త కోణాన్ని పరిచయం చేశారు. మహిళలు పనిచేసే చోట మహిళలపై వారిపట్ల ఎంతో హింసిస్తున్నారని… వారిని ఎంతో వేదనకు గురి చేస్తున్నారని తనని కూడా ఇండస్ట్రీలో ఆ విధంగానే బాధ పెట్టారంటూ బీబీ జోడిగల్ అనే షో నుంచి వనిత తప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటన ఇచ్చారు.
ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ తాను తప్పు లేకుండా ఎవరైనా సరే తనను కించపరిచిన అవమానపరిచిన తను సహించనని అది సీనియర్ అయినా, జూనియర్లు అయినా తనని అనవసరంగా అంటే పడలేనని ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే ఈ విధంగా వనిత విజయ్ కుమార్ మాట్లాడటానికి కారణం ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న రమ్యకృష్ణ కూడా కారణం అయి ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా వనిత చేసిన ఓ డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు రమ్యకృష్ణ కావాలనే తక్కువ మార్కులు ఇచ్చారని, అలా గొడవలు మొదలయ్యాయనే వార్తలు చక్కర్లు కొడుతూ రమ్యకృష్ణ వరకు చేరుకున్నాయి. ఇదే విషయాన్ని రమ్యకృష్ణ అడుగగా అందుకు ఆమె స్పందించి ఎంతోహుందాగా సమాధానం ఇచ్చారు. ఇదే ప్రశ్నను మీరు వనితను అడగాల్సింది… ఇలాంటి అన్నీ చిన్న విషయాలు నా దృష్టిలో ఇప్పటికీ మీరు దానిపై స్పందించమని అంటే.. నేను నో కామెంట్ అని రమ్య కృష్ణ చెప్పుకొచ్చారు.































