Rashmi: రాత్రికి వస్తావా అంటూ రశ్మిని అవమానించిన కమెడియన్… ఇంద్రజ రియాక్షన్ ఇదే?

0
39

Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకొంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మీ పట్ల స్టార్ కమెడియన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సీనియర్ కమెడియన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆటో రాంప్రసాద్ రష్మీ పట్ల చేసినటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ఆటో రాంప్రసాద్ స్కిట్ లో భాగంగా రష్మీ వద్దకు వెళ్లి ఈ రాత్రికి వస్తావా అంటూ తనతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తూ మాట్లాడారు. అసలు నేనెందుకు రావాలి రాత్రికి అంటూ రష్మీ అనడంతో రాత్రికి ఎందుకు వస్తారో తెలియదా అంటూ తెగ సిగ్గు పడిపోయారు. ఇలా రాంప్రసాద్ సిగ్గుపడుతూ ఉండగా అక్కడే ఉన్నటువంటి జడ్జ్ ఇంద్రజ స్పందించారు.

Rashmi: రాంప్రసాద్ పై సీరియస్ అయిన ఇంద్రజ…


రశ్మిని ఇలా అడుగుతూ రాంప్రసాద్ సిగ్గుపడుతూ ఉండగా వెంటనే ఇంద్రజ ఏయ్ అంటూ గట్టిగా అరిచారు. దీంతో రాంప్రసాద్ ఒక్కసారిగా ఉలికి పడుతూ మా ఊర్లో జాతరుంది అందుకే పిలిచామండి అంటూ కవర్ చేసుకుంటారు.అయితే ఇదంతా కూడా స్కిట్ లో భాగమని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ కావడంతో మీరు మీ చెత్త డబుల్ మీనింగ్ డైలాగులు ఇకపై మీరు మారరా అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.