రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇప్పుడంటే ఈయన్ని వివాదాల దర్శకుడు అని అంటున్నారు కానీ ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అయన ఒక సంచలనం.. అయితే..ఇదంతా ఒకప్పుడు. ప్రస్తుతం అయన తీసే సినిమాలకంటే.. చేసే కంట్రవర్సీలతోనే ఎక్కువ ఫోకస్ అవుతున్నారు. నిత్యం ఎవరో ఒకరిమీద కామెంట్స్ చేస్తూనే ఉంటాడు అర్జీవీ.

తాజాగా అల్లు శిరీష్ పై మరో సంచలన ట్వీట్ చేశాడు వర్మ. ఈమధ్యనే అల్లు శిరీష్ తన సిక్స్ ప్యాక్ చూపిస్తూ.. కొన్ని పోటోలను అయన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. అవి కాస్త వర్మకంట పడటంతో.. వాటిలో ఒక ఫోటోను వర్మ షేర్ చేస్తూ.. “ఈ నా కొడుకు కోనన్ ది బార్బేరియన్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కొడుకు కాదు..అల్లు అరవింద్ కొడుకు. అల్లు సార్.. మీ కి జోహార్” అంటూ ట్వీట్ చేశాడు వర్మ.
అయితే వర్మ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు దుమరంగా మారింది. వర్మ వ్యాఖ్యలపై అల్లు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు శిరీష్ ఎవరో మాకు తెలుసు.. కానీ నువ్వు ఎవరి కొడుకు అంటూ కొందరు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు..
Ee Naa koduku CONAN the BARBARIAN Arnold Schwarzenegger koduku Kaadhu..Allu Aravind koduku ……Allu Saaarrr Mee ….Ki….Joharrr???????????? pic.twitter.com/iojyy5E9sy
— Ram Gopal Varma (@RGVzoomin) May 22, 2021


































