Roja: వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి ఈ బియ్యం టాంపరింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికలలో భాగంగా కూటమీ ప్రభుత్వానికి ఏకంగా 164 స్థానాల విజయం సాధించింది. వైకాపా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఈ ఎన్నికల ఫలితాలపై ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి.

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయి అంటూ వైకాపా నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వివి ప్యాట్లనులెక్క పెట్టాలి అంటూ కొంతమంది వైకాపా నేతలు కోర్టును ఆశ్రయించారు. అయితే వివి ప్యాట్లను లెక్క పెట్టాలని చెప్పినప్పటికీ అప్పటికే వివి ప్యాట్లను నాశనం చేశారని ఎన్నికల కమిషన్ చెప్పారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఈ విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా సంచలన విషయాలను బయటపెట్టారు. సాధారణంగా ఎన్నికలు జరిగినా 6 నెలల వరకు ఈ వివి ప్యాట్లను కూడా జాగ్రత్తగా భద్రపరచాలి కానీ ఎన్నికలు జరిగినా నెలలోపు ఈ వివి ప్యాట్లను నాశనం చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద కుట్ర జరిగిందోనని ఈమె తెలిపారు.

Roja: ఈవీఎం మాయ..
ఇకపోతే ఎన్నికల సమయంలో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే విషయాలు రికార్డ్ అయ్యి ఉంటాయి. ఇక ఎన్నికల సమయంలో కూడా అదే ఓట్లు తేలాల్సి ఉంటుంది కానీ ఎన్నికల సమయంలో ఏకంగా 45 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ 45 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని రోజా ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తుంటేనే ఇది ఈవీఎం ప్రభుత్వమని అర్థమవుతుంది అంటూ రోజా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


































