Roller Raghu : సాఫ్ట్ వేర్ కంపెనీలో నా షేర్స్ అన్నీ పోయాయి… నా అనుకున్న వాళ్ళే మోసం చేసారు…: రోలర్ రఘు

0
260

Roller Raghu : సినిమాల్లో కమెడియన్ గా అలాగే జబర్దస్త్ లోను మొదట్లో కమెడియన్ గా వచ్చిన రోలర్ రఘు ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఆది, అదుర్స్ వంటి సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయిన కారుమంచి రఘు ఈ మధ్య కాలంలో తక్కువ సినిమాలను చేస్తున్నారు. దాదాపు 150 సినిమాలకు పైగా కమెడియన్ గా చేసిన రఘు ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలలో కంటే ముందు ఏం చేసేవాడు, అలాగే వ్యక్తిగత జీవితం గురించి వివరించారు.

సినిమా కంటే ముందు వ్యాపారం…

రఘు సినిమాల్లోకి వచ్చే ముందే వ్యాపారంలో స్థిరపడ్డారట. ఆయనకు ఒక ఫామ్ హౌస్ ఉండి మరోవైపు సాఫ్ట్ వేర్ కంపెనీలో పెట్టుబడులు అలాగే ఉద్యోగం ఉండేవట. అందువల్ల సినిమాలను ప్రవృత్తిగా మాత్రమే చూసేవారట రఘు. అయితే తెలిసిన వాళ్ళే డబ్బు మోసం చేయడం, షేర్స్ నష్టపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడి ఫామ్ హౌస్ అన్నీ పోయాయని తెలిపారు.

తరువాత అదుర్స్ సినిమా అవకాశం రావడం, ఇక ఆ సినిమాలో కామెడీకి బాగా పేరు రావడం వల్ల పూర్తిగా సినిమాల వైపుకి వచ్చేసానని తెలిపారు. ప్రవృత్తి కాస్తా వృత్తి అయిపోయింది. ప్రస్తుతం నా భార్య, బిడ్డలను సినిమాల్లో వచ్చే డబ్బుతోనే పోషిస్తున్నాని అంటూ చెప్పారు. అప్పటి దాకా కొన్ని సినిమాలే చేసినా అదుర్స్ తరువాత వరుస ఆఫర్స్ రావడంతో బాగా స్థిరపడ్డానంటూ చెప్పారు.