బర్త్ డే స్పెషల్ : ఆ రికార్డులు సాయి పల్లవికి మాత్రమే సొంతం..!!

0
129

ఫిల్మ్ ఇండస్ట్రీలో అందం, తనదైన అభినయంతో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే సౌత్ లో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.. అంతేకాదు సౌత్ లో ఏ హీరోయిన్ క్రియేట్ చేయలేని రికార్డులను సైతం తన పేరున క్రియేట్ చేసుకుంది ఈ మలయాళ భామ. తమిళ దర్శకుడు అల్ఫోన్సో తెరకెక్కించిన ‘ప్రేమమ్’ చిత్రం వెండితెర అరంగ్రేటం చేసిన సాయిపల్లవి…తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది.

భానుమతిగా తన నటనతో అందరినీ ‘ఫిదా’ చేసేసింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది.తర్వాత నాని సరసన ఎం.సి.ఏ చిత్రంలో నటించింది. ఆ తరువాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాలు చేసింది. తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన ‘మారి-2’ చిత్రంతో నటించి కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. కానీ ఆమెకు కోలీవుడ్ పెద్దగా కలిసి రాలేదనే చెప్పొచ్చు. మారి-2, దియా అనే తమిళ హార్రర్ మూవీ, ఆ తరువాత సూర్యతో కలిసి సాయి పల్లవి నటించిన ‘ఎన్జికే’ చిత్రాలు భారీ ఫ్లాప్ లుగా నిలిచాయి. టాలీవుడ్ లో మాత్రం ఆమె నటించిన చిత్రాలన్నీ మంచి ఫలితాలనే ఇచ్చాయి.

ఒక్క ‘పడి పడి లేచే మనసు’ తప్ప. ఇక తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా భారీ సంఖ్యలో అభిమాన గణాన్ని సొంతం చేసుకుంది.గతంలో కూడా సాయి పల్లవి, ధనుష్ జంటగా నటించిన ‘మారి-2’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ 1.14 బిలియన్ల వ్యూస్ దాటేసి హిస్టరీ క్రియేట్ చేసింది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నటించిన ‘ఫిదా’ చిత్రంలోని ‘వచ్చిండే’ సాంగ్ 300 మిలియన్ల వ్యూస్ దాటింది. ఇక తాజాగా ‘సారంగదరియా’ సాంగ్ 17.6 మిలియన్ వ్యూస్ దాటింది. సౌత్ లో ఒక హీరోయిన్ సాంగ్స్ కు ఇంతటి ఆదరణ రావడం విశేషం.ఇక ప్రస్తుతం సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న రొమాంటిక్ యూత్ ఫుల్ మూవీ ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రం విడుదల గురించి ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘లవ్ స్టోరీ’ విడుదలకు బ్రేక్ పడింది. మరోవైపు సాయిపల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటిస్తున్న మూవీ ‘విరాటపర్వం’ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానుల కోసం తాజాగా సాయి పల్లవి బర్త్ డే సీడీపీ రిలీజ్ అయ్యింది. ఇందులో సాయి పల్లవి రెడ్ కలర్ సారీలో తన స్మైల్ తో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. మరోవైపు ఇటీవల సెన్సేషనల్ గా మారిన ‘సారంగదరియా’ అనే ఫోక్ సాంగ్ కు స్టెప్పులేస్తున్న సాయి పల్లవి లుక్, మరోవైపు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న ‘విరాటపర్వం’ చిత్రంలోని సాయిపల్లవి లుక్ తో సీడీపీని రెడీ చేశారు. ఇక మన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ ని అందజేస్తూ.. ఫ్యూచర్ లో మరిన్ని మంచి సినిమాల్లో నటించాలని కోరుకుందాం…!!