దివంగత నటుడు దిలీప్ కుమార్ సతీమణి సైరా బాను ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు. గత మూడు రోజులుగా రక్తపోటు సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్చినట్లు సన్నిహితులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ సీనియర్ హీరో దిలీప్ కుమార్ జూలై 7 న అనారోగ్యంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. దిలీప్ మృతితో తీవ్రస్థాయిలో మనస్థాపానికి గురైన అతడి భార్య సైరా బాను అప్పటి నుంచి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు.

మూడు రోజుల క్రితం రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చెర్పించినట్లు కుటుంబ సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. దీంతో వైద్యులు ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే భర్త మరణమే సైరా భాను అనారోగ్యానికి కారణం అని సన్నిహితులు చెబుతున్నారు. దిలిప్ కుమార్.. సైరా బానుది ప్రేమ వివాహం.
ఆయన ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు దగ్గరుండి ఆమె సేవలు చేశారు. ఆయన మరణం తర్వాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని సన్నిహితులు అంటున్నారు. ఇక ఆమె అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు.. పలువురు సినీ ప్రముఖులు ప్రార్థనలు చేస్తున్నారు.
దిలీప్ కుమార్ మరియు అతని కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ధర్మేంద్ర.. సైరా భాను ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజుల నుండి ఆమె హెల్త్ బాగాలేదని ఆయన పేర్కొన్నాడు. సైరా బానుకు తాను కాల్ చేస్తే ఆమె ఎత్తలేదని తరువాత ఆమె తిరిగి ఫోన్ చేసి.. ఆరోగ్యం బాగోలేదని ఆమె నాకు చెప్పిందని అన్నారు.
































