ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ వేర్వేరుగా రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన తర్వాత కలిసి చేస్తున్న సినిమా ఇది. అటు ముందు రంగస్థలం సినిమాతో మంచి హిట్ అందుకున్నారు సుకుమార్.. ఆ తర్వాత రెండేళ్ళకు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో రంగస్థలం రికార్డులను తిరగరాసాడు.

అలాంటి ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవల్ తీస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి సారిగా రష్మిక ఈ సినిమాలో డిగ్లామరస్ రోల్ లో నటించడం విశేషం. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుంది.

మొదటి పార్ట్ ను డిసెంబర్ 17న క్రిస్ మస్ పండుగ కానుకగా విడుదల అవుతోంది. ఇక ఈ సినిమాకు సంబధించి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే అన్ని పాటల చిత్రీకరణ పూర్తైంది. కేవలం మరో పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. తన ప్రతీ సినిమాలోనూ ఐటమ్ సాంగ్ ఉండేలా చూసుకుంటాడు సుక్కు. తొలి సినిమా ఆర్య నుంచి నిన్నటి రంగస్థలం వరకు ప్రతీ సినిమాలోనూ అదిరిపోయే ఐటం సాంగ్ పెట్టాడు.
ఈ పాట కోసం పూజా హెగ్డే, తమన్నా లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ చివరికి మాజీ అక్కనేని కోడలు సమంత ఫైనల్ అయింది. ఇక తాజాగా సమంత ఐటెం సాంగ్ కు సంబంధించి పుష్ప టీం క్రేజీ అప్ డేట్ ను ఇచ్చింది. సమంత పోస్టర్ రిలీజ్ చేస్తూ..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సమంత కలసి చేస్తున్న రాకింగ్ నంబర్ ను భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నామని తెలిపారు. త్వరలో ఈ ‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ ని చూడటానికి సిద్ధంగా ఉండండని పేర్కొన్నారు. ఇక ఈ పోస్టర్ లో సమంత లంగా జాకెట్ ధరించి, ఫుల్ మాస్ లుక్‌లో.. తన బ్యాక్ సైడ్ చూపిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ పాటలో సమంత అదిరిపోయే స్టెప్పులు వేసినట్లు సమాచారం.


































